చ‌రిత్ర‌కారుడు ముషిరుల్ హ‌స‌న్ క‌న్నుమూత‌

న్యూఢిల్లీ: చ‌రిత్ర‌కారుడు ముషిరుల్ హ‌స‌న్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 69 ఏళ్లు. జామియా మిలియా ఇస్లామియా వ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్‌గా చేశారాయ‌న‌. ఆయ‌న భార్య జోయా హ‌స‌న్ .. రాజ‌కీయ విశ్లేష‌కురాలు. నేష‌న‌ల్ ఆర్క్వీస్ ఆప్ ఇండియాకు డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా చేశారు. ఇండియ‌న్ హిస్ట‌రీ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా కూడా చేశారు. 2014లో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ త‌ర్వాత ఆయ‌న ఆరోగ్యం క్షీణించింది. ద‌క్షిణ ఆసియాలో.. ఇస్లాం, ముస్లింల‌పై ఆయ‌న విస్తృత స్థాయిలో ర‌చ‌న‌లు చేశారు. వెన్ స్టోన్ వాల్స్ క్రై పుస్త‌కంలో.. ఆయ‌న నెహ్రూ చెర‌శాల జీవితం గురించి రాశారు. జామియా ఖ‌బ‌ర‌స్తాన్‌లో ఖ‌న‌నం నిర్వ‌హించ‌నున్నారు.

Related Stories: