ఎమ్మెల్యే ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు

జనగామ: పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లాలోని దేవరుప్పల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లోకి చేరిన వారందరినీ కంటికి రెప్పలా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
× RELATED ఈ సారి నాగ‌శౌర్య‌తో మెగా హీరో మ‌ల్టీ స్టార‌ర్..!