కాంగ్రెస్ జాబితాపై రేణుకా చౌదరి అసంతృప్తి

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాపై ఆ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరిని సంప్రదించి అభ్యర్థుల జాబితాను రూపొందించారో అర్థం కావడం లేదన్నారు. జాబితా రూపకల్పనలో సామాజిక వర్గాల సమతూకం పాటించలేదని స్పష్టం చేశారు. పారాచూట్ నేతలకు అవకాశం కల్పించడం దారుణం. కమ్మ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. పొన్నాల లక్ష్మయ్యను విస్మరించడం బాధాకరం. ప్రకటించిన జాబితాలో మార్పులు జరుగుతాయని తాను అనుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. సమీకరణాల ప్రభావం ఎలా ఉంటుందో డిసెంబర్ 11న తెలుస్తుంది. కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నా.. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని రేణుకా చౌదరి స్పష్టం చేశారు.

Related Stories: