మహిళా టీంపై వేధింపులు..ఐదుగురు అధికారులు సస్పెండ్

కాబూల్ : ఆప్ఘన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణల్లో ఐదుగురు ఉన్నతాధికారులపై వేటు పడింది. మహిళా టీం సభ్యులపై శారీరక, భౌతిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల్ సమాఖ్య అధ్యక్షుడితోపాటు మరో నలుగురు అధికారులను సస్పెండ్ చేశామని ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై వేధింపుల విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ..ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు వేగవంతం చేయాలని అటార్నీ జనరల్ జంషిద్ రసులీని ఆదేశించారు. తాజాగా ఈ కేసులో ఫుట్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, గోల్ కీపర్స్ హెడ్, ప్రొవిన్షియల్ కో ఆర్డినేటర్ హెడ్ తోపాటు మరో ఉన్నతాధికారిని సస్పెండ్ చేసినట్లు జంషిద్ రసూలీ తెలిపారు.

Related Stories: