ఐదు రాష్ర్టాల్లోనూ బీజేపీకి చుక్కెదురే

న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగనున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని లోక్‌తాంత్రిక్ జనతాదళ్ పార్టీ అధినేత శరద్ యాదవ్ జోస్యం చెప్పారు. రాజస్థాన్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు పునాది వంటివన్నారు. 2014లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తి చేయకపోవడంతో నరేంద్రమోదీ ప్రభుత్వంతో ప్రజలు విసుగెత్తిపోయారని పీటీఐతో చెప్పారు. ప్రధాని మోదీ మరోసారి చాయ్‌వాలా నినాదాన్ని ముందుకు తెచ్చి భావోద్వేగం రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మరోవైపు బీజేపీ నేతలు అయోధ్యలో రామ మందిర నినాదాన్ని లేవనెత్తుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలన్న బీజేపీ కలలు కల్లలు కాక తప్పదన్నారు.

Related Stories: