రూ. 2 లక్షల రుణమాఫీ ఓ భూటకం: గుత్తా

నల్లగొండ: కాంగ్రెస్ చెబుతున్న రూ. 2 లక్షల రుణమాఫీ ఓ భూటకమని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకుడు ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆజాద్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నయి. రాజకీయాల కోసమే ఆజాద్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నడు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్‌ఎస్ ప్రమేయం లేదని ఆజాద్ అనడం సరికాదన్నారు. కేసీఆర్ పోరాటం, దార్శనికత, చాకచక్యం లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ముమ్మాటికీ సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చింది. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు.

Related Stories: