సి-విజిల్ కు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తం..

హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదుల కోసం దేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో సి-విజిల్ యాప్ వినియోగిస్తున్నామని ఎన్నికల సంఘం రాష్ట్ర సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలి తెలిపారు. ఈ విషయమై ఆమ్రపాలి మీడియాతో మాట్లాడుతూ..సి-విజిల్ యాప్ కొంత మెరుగైందని, రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. సి-విజిల్ లో ఇప్పటివరకు 2,251 ఫిర్యాదులు రాగా..1279 పరిష్కరించామన్నారు. డబ్బు, మద్యం, చీరల పంపిణీ, వాల్ పోస్టర్లు, బ్యానర్లు, ప్రచార ర్యాలీలపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఫిర్యాదులకు సంబంధించి ఫోటోలు, వీడియోలు పంపిస్తే 100 నిమిషాలలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆమ్రపాలి పేర్కొన్నారు. కంప్లైంట్ ఇచ్చినవారి మొబైల్ నంబర్ కు ఫిర్యాదు ఏ దశలో ఉందో మెసేజ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేసే ఏర్పాట్లు చేసినట్లు ఆమ్రపాలి చెప్పారు.

Related Stories: