రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసుల నోటీసులు

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాల కేసులో నోటీసులు పంపారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ అయ్యాయి. 2003 నుంచి 2005 వరకు ఉన్న హౌసింగ్ సొసైటీ కమిటీకి నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని రేవంత్‌రెడ్డి సహా 13 మందికి నోటీసుల్లో పేర్కొన్నారు. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారని రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.

Related Stories: