కంపెనీలు గుడ్ బై చెప్తానంటే కుదరదు.. ట్రంప్

అమెరికాలో వ్యాపారం చేసేవారిని ప్రోత్సహిస్తామని, దేశం నుంచి బిచాణా ఎత్తేయాలనుకున్న వారిపట్ల మా త్రం కఠినంగా వ్యవహరిస్తామని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాలో ఇప్పుడున్న కంపెనీలు దేశానికి వీడ్కోలు చెప్పి, ఉద్యోగులను తొలగించి విదేశాలకు తమ సంస్థలను తరలించాలనుకుంటే సహించేది లేదని ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన వారాంతపు ప్రసంగంలో పేర్కొన్నారు. దేశం విడిచి వెళ్లే కంపెనీలు తదనంతర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పన్నుల విధానంలో భారీ సంస్కరణలు తేవడానికి కృషి చేస్తున్నామని, దేశంలోని వ్యాపారాలు, కార్మికులపై ఉన్న పన్నులను బాగా తగ్గిస్తామని చెప్పారు. ఇదే సమయంలో కంపెనీలు దేశం విడిచి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Related Stories: