కోమియో ఎక్స్1 స్మార్ట్‌ఫోన్ విడుదల

మొబైల్స్ తయారీదారు కోమియో తన నూతన స్మార్ట్‌ఫోన్ కోమియో ఎక్స్1 ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.7,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ఫోన్‌పై జియో రూ.2200 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. ఒక్కోటి రూ.50 విలువైన 44 వోచర్లు ఈ క్యాష్‌బ్యాక్‌లో భాగంగా వస్తాయి. ఇందుకు గాను కస్టమర్లు రూ.198 లేదా రూ.299 ప్లాన్‌లను రీచార్జి చేసుకోవాలి. ఇక ఐడియా సెల్యులార్ ఈ ఫోన్‌పై నెలకు 10 జీబీ చొప్పున 6 నెలలకు గాను మొత్తం 60 జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నది. ఇందుకు కస్టమర్లు రూ.199 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాలి. ఇక ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.

కోమియో ఎక్స్1 ఫీచర్లు...

5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

× RELATED భారత్ జోరు.. టీ20 సిరీస్ మనదే