గుండెపోటుతో కమెడియన్ మృతి

టీవీ నటుడు, కమెడియన్ కవి కుమార్ ఆజాద్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. తారక్ మెహతా కా ఉల్టా చష్మా షోలో డాక్టర్ హన్స్‌రాజ్ హాతి క్యారెక్టర్‌తో కవి కుమార్ ఫేమస్ అయ్యాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కవి కుమార్‌ను వోక్‌హార్ట్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. అయితే ఇవాళ మరోసారి తీవ్రమైన గుండెపోటు రావడంతో అతడు చనిపోయినట్లు ఆ షో ప్రొడ్యూసర్ అసిత్ కుమార్ మోదీ చెప్పాడు. సీనియర్ నటుడు కవికుమార్ ఆజాద్ చనిపోయారు.

అతడు తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో డాక్టర్ హాతి క్యారెక్టర్ పోషిస్తున్నాడు. సోమవారం ఉదయం తీవ్ర గుండెపోటు కారణంగా కవికుమార్ చనిపోయాడు. అతడు ఈ షోను చాలా ఇష్టపడ్డాడు. తన ఆరోగ్యం బాగా లేకపోయినా షూటింగ్‌కు వచ్చేవాడు. ఇవాళ ఉదయం ఫోన్ చేసి షూటింగ్‌కు రాలేనని చెప్పాడు. ఆ తర్వాత అతడు చనిపోయిన వార్త తెలిసింది అని అసిత్‌కుమార్ చెప్పాడు. మేలా, ఫంతూష్‌లాంటి బాలీవుడ్ సినిమాల్లోనూ కవి కుమార్ నటించాడు.

× RELATED శృంగారానికి ఒప్పుకోలేదని ట్రాన్స్‌జెండర్‌పై కాల్పులు