దివ్యాంగులకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దివ్యాంగులకు వివిధ కోర్సుల్లో మూడు నెలల పాటు ఇచ్చే ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర కోఆర్డినేటర్ ఆవుల వెంకటేశ్ తెలిపారు. డీఈపీడబ్ల్యూడీ, పీఎంకేవీవై సంయుక్త ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని దివ్యాంగులకు ఎంఎస్ ఆఫీస్, ఇంగ్లిష్ టైపింగ్, స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుల్లో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఉపాధి అవకాశాల కోసం బ్యాంకు రుణాలకు దరఖాస్తులను సిఫారసు చేస్తామని చెప్పారు. శిక్షణలో భాగంగా ఉపకరణాల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున, శిక్షణ అనంతరం సర్టిఫికెట్స్‌తో పాటు ప్రయాణ ఖర్చుల నిమిత్తం నెలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని తెలిపారు. 18 ఏండ్ల పైబడి ఉండడంతో పాటు 40 శాతం వైకల్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇందుకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు మెడికల్ బోర్డు సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేయాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం 8179137617 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Related Stories: