బోటు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్ : ఆంధప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పాపికొండ టూర్ లో జరిగిన బోటు ముంపు ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల్లో తెలంగాణవాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనలో 21 మంది తెలంగాణవాసులున్నట్లు సమాచారం.

Related Stories:

More