సీఎం కేసీఆర్ నియోజకవర్గ సభల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ సభల షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 19, 20 తేదీల్లో ఆరు సభల ద్వారా సీఎం కేసీఆర్ మలి విడత ప్రచారం చేపట్టనున్నారు.

నియోజకవర్గ సభల షెడ్యూల్.. *ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 2:30 కు ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ ప్రాంగణంలో పాలేరు- ఖమ్మం నియోజకవర్గాల సభ నిర్వహించనున్నారు. *19వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు జనగామ జిల్లా పాలకుర్తిలో ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉంటుంది. *ఈ నెల 20వ తేదీ ఒంటిగంటకు దుబ్బాక-సిద్దిపేట నియోజకవర్గాల సభ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉంటుంది. మధ్యాహ్నం 2:30 కు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో నియోజకవర్గ సభను ఉంటుంది *20వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు సిరిసిల్ల జిల్లా వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల సభ సిరిసిల్లలో ఉంటుంది

Related Stories: