ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైంది: సీఎం కేసీఆర్

హైదరాబాద్ : శ్రీలంకలో జరిగిన బాంబు దాడులను ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైందని సీఎం కేసీఆర్ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకున్న వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 150మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 500 మంది వ్యక్తులు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
More in జాతీయం :