ఉద్య‌మించిన మ‌హిళ‌లు.. వెన‌క్కి త‌గ్గిన‌ సీఎం

దేన్‌క‌న‌ల్ : ఒడిశాలో అడ‌వుల న‌రికివేత‌ను మ‌హిళ‌లు వ్య‌తిరేకించ‌డంతో సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ భారీ ప్రాజెక్టును ర‌ద్దు చేశారు. దేన్‌క‌న‌ల్ జిల్లాలోని బ‌ల‌రాంపూర్ మ‌హిళ‌లు ఈ ఉద్య‌మం చేశారు. జింక‌ర్‌గ‌డి అడ‌వుల్లో ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం ఓ బ్రెవ‌రేజ‌స్ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయాల‌ని భావించింది. దీని కోసం న‌వంబ‌ర్ 3వ తేదీన సీఎం ప‌ట్నాయ‌క్ శంకుస్థాప‌న కూడా చేశారు. మొత్తం 102 కోట్ల‌తో 12 ఎక‌రాల్లో పీఏ బాటిల్స్ సంస్థ ఈ కంపెనీని స్థాపించాల‌నుకున్న‌ది. అయితే స్థానిక మ‌హిళ‌లు చిప్‌కో ఉద్య‌మం త‌ర‌హాలో అక్క‌డ అడ‌వుల న‌రికివేత‌ను వ్య‌తిరేకించారు. చెట్ల‌ను హ‌త్తుకుంటూ అక్క‌డి మ‌హిళ‌లు దిగిన ఫోటోలు కొన్ని ఇటీవ‌ల వైర‌ల్ అయ్యాయి. దీంతో సీఎం ప‌ట్నాయ‌క్ బ్రెవ‌రీ ప్రాజెక్టును ర‌ద్దు చేశారు.

Related Stories: