ప్రధాని, ఆర్థికమంత్రి జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. లేఖలో మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టు పనులను జీఎస్టీ నుంచి మినహాయించాలని సీఎం కోరారు. అదేవిధంగా బీడీ, గ్రానైట్ పరిశ్రమలను జీఎస్టీ నుంచి మినహాయించాలన్నారు. బీడీ పరిశ్రమపై అధిక పన్నులు వేస్తే ఉపాధికి నష్టం వాటిల్లే ప్రమాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2 వేలకు పైగా గ్రానైట్ యూనిట్లు ఉన్నాయని తెలిపిన సీఎం ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ఉత్పత్తులపై 12.28 శాతం పన్నులు విధిస్తే గ్రానైట్ పరిశ్రమ దెబ్బతింటుందన్నారు. అనివార్యంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచిఉందన్నారు.

Related Stories: