ఇవాళ కేంద్ర హోం, ఆర్థిక మంత్రులతో భేటీకానున్న సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న ప్రధానిని కలిసిన సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సంబందించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం సమావేశమవనున్నారు. మధ్యాహ్నం 3.30 కి హోంమంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. నూతన జోనల్, విభజన హామీ అంశాలపై హోంమంత్రితో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. సాయంత్రం 4.30 కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం భేటీ అవుతారు. ఈ సమావేశంలో ఎఫ్‌ఆర్‌బీఎం పెంపు, వెనుకబడిన జిల్లాల నిధుల విడుదలపై చర్చించనున్నారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?