రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఉన్నతాధికారులతో కలిసి సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ర్టానికి సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్రమంత్రులను కలిసి సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అవసరమైతే ఢిల్లీలోనే రెండు మూడు రోజుల ఉండి ప్రధాని, ఇతర మంత్రులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి ఆశించిన స్పందన రావడం లేదని భావిస్తున్న సీఎం.. ప్రధాని చొరవ తీసుకోవాలని కోరనున్నారు. సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలాల కేటాయింపు గురించి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో మాట్లాడి రావాలని సీఎం నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌తో పాటు సీఎస్ ఎస్‌కే జోషి, ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ఢిల్లీ వెళ్లనున్నారు.
× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..