నామినేషన్ పత్రాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

సిద్దిపేట: జిల్లాలోని నంగనూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావుతో కలిసి కోనాయిపల్లి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు గ్రామస్థులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం సీఎం మాట్లాడుతూ.. రైతులకు అప్పులు లేని తెలంగాణే బంగారు తెలంగాణ అన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రైతుల ఆదాయం పెరగాలి. దేశంలోనే ధనిక రైతులకు తెలంగాణ వేదికవ్వాలన్నారు. రెండేళ్లలో సిద్దిపేటలో రైలు కూత వినిపిస్తదని తెలిపారు. సిద్దిపేటలో హరీశ్‌రావు ఆశీర్వదించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకునే.. మీ మధ్యే పెరిగానని సీఎం అన్నారు. వచ్చే ఏడాది కాళేశ్వరం నీళ్లతో దేవుడి పాదాలు కడుగుతామన్నారు. ఇక్కడ పూజలు చేసే ఉద్యమానికి బయల్దేరాను. మీ దీవెనలతో యుద్ధానికి పోతున్నా. వంద సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో మధ్యాహ్నం 2.34 గంటలకు సీఎం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Related Stories: