రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ యాగం

సిద్దిపేట: ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో రాజశ్యామల యాగాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారు. రెండు రోజుల పాటు యాగం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11:11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని యాగం చేస్తున్నారు. విశాఖ స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో యాగం కొనసాగుతోంది. కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాజ్యసభ సభ్యులు కేశవరావు, కెప్టెన్ లక్ష్మీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Related Stories: