ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన 14 అంశాలపై ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నారు. ప్రత్యేక మైకోర్టు ఏర్పాటు గురించి మరోసారి సీఎం ప్రస్తావించనున్నారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. రక్షణ శాఖ భూములు రాష్ర్టానికి బదలాయించాలని కోరనున్నారు. రాష్ర్టానికి ఐఐఐటీ, ఐఐఎం మంజూరును సీఎం కోరనున్నారు. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుపై మోదీతో సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.

Related Stories: