పంద్రాగస్టు నుంచి రైతు బీమా పథకం ప్రారంభం: సీఎం

హైదరాబాద్: పంద్రాగస్టు నుంచి రైతు బీమా పథకం ప్రారంభం కానుండటంతో.. రైతు బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్‌లో రైతు బంధు జీవిత బీమాపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే దివాకర్ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడిన సీఎం.. రైతుకు బీమా అందించే క్రమంలో దశల వారీగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రైతుకు బీమా అందించేందుకు ఏర్పాటు చేసుకోవాల్సిన యంత్రాంగం గురించి అధికారులకు వివరించారు.

Related Stories: