మణెమ్మ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య సతీమణి మణెమ్మ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మణెమ్మ కుటుంబసభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భగవంతుణ్ని ప్రార్థించారు. మణెమ్మ మృతిపట్ల ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా సంతాపం ప్రకటించారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మణెమ్మ ఆదివారం తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2008లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు.

Related Stories: