హరికృష్ణ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులు

హైదరాబాద్ : సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఇవాళ మధ్యాహ్నం మాసాబ్‌ట్యాంకులోని హరికృష్ణ నివాసానికి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు.. హరికృష్ణ నివాసంలోకి తీసుకెళ్లారు. అనంతరం హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్.. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..