కొండగట్టు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఇవాళ సంభవించిన రోడ్డుప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 32 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణ నష్టం జరగడం, పలువురికి గాయాలు కావడంపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
× RELATED మృతుడి కుటుంబానికి రూ. 3లక్షలు ఎక్స్‌గ్రేషియా