పద్మశాలి భవన నిర్మాణానికి 5 కోట్లు మంజూరు: సీఎం

హైదరాబాద్: పద్మశాలి భవన నిర్మాణానికి 2.5 ఎకరాల స్థలం, రూ. 5 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ ప్రగతి భవన్‌లో పద్మశాలి సంఘం ప్రముఖులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. పద్మశాలీల అభ్యున్నతికి బహుముఖ వ్యూహంతో ముందుకు పోవాలన్నారు. చేనేత, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికి చేయూతను అందించాలి. వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నామ ఉపాధి మార్గాలు చూపాలి. పద్మశాలీల సంక్షేమానికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చే నిధులతో నేతన్నలకు శాశ్వత పరిష్కారాలు చూపాలి. హైదరాబాద్‌లో పద్మశాలి భవనం నిర్మాణానికి నిధులు అందిస్తాం. పద్మశాలీ సంఘం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి. పద్మశాలీ సంఘం సంక్షేమ నిధికి మొదటి విరాళం టీఆర్‌ఎస్ అందిస్తుంది. నిధికోసం మొదటి విరాళంగా టీఆర్‌ఎస్ నుంచి రూ.50 లక్షలు అందిస్తాం. పద్మశాలి సంఘం ప్రముఖులు కూడా సంక్షేమ నిధికి విరాళాలు ఇవ్వాలి.. అని సీఎం పేర్కొన్నారు.

Related Stories: