జన్ ధన్ ఖాతాల్లో జమ ఎంత?

-పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలోఆర్బీఐని వివరాలడిగిన సీఐసీ న్యూఢిల్లీ : పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వివిధ బ్యాంకుల్లోని జన్ ధన్ ఖాతాల్లో డిపాజిటైన ఆ కరెన్సీ వివరాలను చెప్పాలని ఆర్బీఐకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) సూచించింది. పేదలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడానికి 2014 ఆగస్టులో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనను కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. పాత పెద్ద నోట్లు రద్దు తర్వాతే జన్ ధన్ ఖాతాలు ప్రాచూర్యంలోకి వచ్చాయి. అప్పటిదాకా డబ్బులే కనిపించని జన్ ధన్ ఖాతాల్లో అకస్మాత్‌గా వేల కోట్లు దర్శనమివ్వడమే దీనికి కారణం. వీటిలో ఈ ఏడాది ఏప్రిల్‌కల్లా దాదాపు రూ.80 వేల కోట్ల నగదు నిల్వలు చేరాయి. దీంతో ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ ఈ వివరాల కోసం సీఐసీని ఆశ్రయించారు. దీనిపై జవాబి వ్వాల ని ఆర్బీఐని సమాచార కమిషనర్ సుధీర్ భార్గవ ఆదేశించారు. ఒకవేళ ఈ వివరాలు తెలియకపోతే తమ వద్ద అందుబాటులో లేవని కమిషన్‌కు బ్యాంకులు ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయొచ్చ ని ఆర్బీఐకి సుధీర్ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అక్రమాలు జరిగాయన్న అనుమానాలతో ప్రభుత్వం, ఆర్బీఐ దర్యాప్తు సంస్థలతో విచారణ కూడా చేయిస్తున్నాయి.

Related Stories: