త్వరలో కోటి రూపాయలతో క్రైస్తవ భవన్..

మహబూబ్ నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైస్తవుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కల్వరి టెంపుల్ లో జరిగిన ఈస్టర్ సన్ రైజ్ సండే వేడుకలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాలమూర్ జిల్లా కేంద్రంలో త్వరలో కోటి రూపాయలతో క్రైస్తవ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. క్రైస్తవ ధర్మ ప్రచారకులు పాస్టర్లకు అండగా ఉంటామని భరోనిచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈస్టర్ సన్ రైజ్ సండే వేడుకల్లో క్రైస్తవ స్త్రీ సమాజం ప్రదర్శించిన యేసు క్రీస్తు పునరుత్థాన ఇతివృత్తం అందరినీ ఆకట్టుకుంది.
More in తాజా వార్తలు :