కాజ‌ల్‌ని కిస్ చేయ‌డంపై వివ‌ర‌ణ ఇచ్చిన చోటా

ప్ర‌స్తుతం దేశంలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న ద‌శ‌లో ఇన్నాళ్ళు పెద్ద మ‌నుషులుగా ఉన్న కొంద‌రి చీక‌ణి కోణాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు క‌వ‌చం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కాజ‌ల్‌ని ప‌బ్లిక్‌గా కిస్ చేయ‌డంపై ప‌లు విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజ‌న్స్ చోటా కె నాయుడుని టార్గెట్ చేస్తూ ఆయ‌న‌ని ఇండ‌స్ట్రీ నుండి బ‌హిష్క‌రించాల‌ని అన్నారు. గ‌తంలోను ప‌లు సంద‌ర్భాల‌లో చోటా కె నాయుడు హీరోయిన్స్‌తో అస‌భ్యంగా మాట్లాడంటూ పాత వీడియోల‌ని తీసి మ‌రీ సోష‌ల్ మీడియాలో ఆయ‌నని ట్రెండ్ చేశారు. వివాదం తీవ్రంగా మారుతున్న స‌మ‌యంలో చోటా కె నాయుడు ఈ వివాదంపై స్పందించారు. సౌంద‌ర్య త‌ర్వాత నేను అంత‌గా అభిమానించే హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఆమెతో చాలా సినిమాలు చేశాను. నా ముద్దు వెనుక ఉన్న కార‌ణం ఆమె ప‌నిత‌నం మెచ్చుకోవ‌డ‌మే త‌ప్ప మ‌రో ఉద్ధేశం లేదు అని వివ‌ర‌ణ ఇచ్చారు చోటా కె నాయ‌డు. మ‌రి సినిమాటోగ్రాఫ‌ర్ ఇచ్చిన వివ‌ర‌ణ‌తో నెటిజ‌న్స్ చ‌ల్ల‌బ‌డ‌తారా లేదా అనేది చూడాలి.

Related Stories: