విజయ్ మాల్యాపై చెక్ బౌన్స్ కేసు 11కు వాయిదా

హైదరాబాద్ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై హైదరాబాద్‌లోని క్రిమినల్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈమేరకు ఇవాళ ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది. అనంతరం కేసును నవంబర్ 11కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కాగా, దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి సుమారు 9 వేల కోట్లు రుణం తీసుకుని ఎగవేశాడని విజయ్ మాల్యాపై ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాల్యా లండన్‌లో ఆశ్రయం తీసుకుంటున్నారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?