సన్‌రైజర్స్ బ్యాటింగ్.. చెన్నై టీమ్‌లో వాట్సన్

ముంబై: ఐపీఎల్ తొలి క్వాలిఫయర్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్‌కింగ్స్. ఈ మ్యాచ్‌కు చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే సన్‌రైజర్స్ బరిలోకి దిగుతున్నది. అటు చెన్నై టీమ్‌లో మాత్రం ఒక మార్పు చేశారు. సామ్ బిల్లింగ్స స్థానంలో షేన్ వాట్సన్ మరోసారి టీమ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. ఓడిపోయిన టీమ్‌కు మరో అవకాశం ఉంటుంది. రేపు కోల్‌కతా, రాజస్థాన్ మధ్య జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తొలి క్వాలిఫయర్‌లో ఓడిన టీమ్ ఆడుతుంది.

Related Stories: