మూడోసారి కప్ కైవసం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

ముంబయి: ముంబయి వాంకడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్దేశిత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఆ స్కోరును ఛేదించే క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లు వాట్సన్ 117 పరుగులు చేసి, రాయుడు 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సురేశ్ రైనా 32, ప్లిస్సీస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్ జట్టు 18.3 ఓవర్లలో 181 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు శర్మ 1, బ్రీత్‌వెయిట్ 1 వికెట్లు తీసుకున్నారు.

Related Stories: