తక్కువ ధరకే కార్లు ఇప్పిస్తానంటూ మోసం...

హైదరాబాద్: బ్యాంకులు సీజ్ చేసిన కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ రవివర్మ అనే వ్యక్తి మోసం చేశాడు. కార్లు తక్కువ ధరకే వస్తాయన్న ఆశతో చాలా మంది అతడి వలలో చిక్కి లక్షల రూపాయిలు సమర్పించుకున్నారు. ఎంతకూ కార్లు ఇప్పించక పోవడంతో అతడి మోసం బయట పడింది. ఉదయం ఆరుగురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయంత్రం రవివర్మను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరైనా నిందితుడి బాధితులు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు సూచించారు.
× RELATED మిగతా హీరోల తరహాలో నేను నటించలేను..