జూలై 15న చంద్ర‌యాన్-2 ప్ర‌యోగం

హైద‌రాబాద్‌: చంద్ర‌యాన్‌-2 మిష‌న్‌ను జూలై 15వ తేదీన ప్ర‌యోగించ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఇస్రో చైర్మ‌న్ డాక్ట‌ర్ కే శివ‌న్ తెలిపారు. జూలై 15వ తేదీన తెల్ల‌వారుజామున 2 గంట‌ల 51 నిమిషాల‌కు ప్రయోగించ‌నున్నారు. చంద్ర‌యాన్‌-2 మిష‌న్‌లో మూడు మాడ్యుళ్లు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ ద్వారా ప్ర‌యోగిస్తారు. చంద్ర‌యాన్‌-2 మొత్తం బ‌రువు సుమారు 3.8 ట‌న్నులు ఉంటుంది. దాంట్లో ప్రొపెల్లంట్ బ‌రువే సుమారు 1.3 ట‌న్నులు ఉంది. సెప్టెంబ‌ర్ 6 లేదా 7న చంద్ర‌యాన్‌-2 రోవ‌ర్ చంద్రుడిపై ల్యాండ్ అవుతుంద‌ని శివ‌న్ తెలిపారు. చంద్ర‌యాన్‌-2 ప్రాజెక్టు ఖ‌రీదు 603 కోట్లు అని ఇస్రో చైర్మ‌న్ చెప్పారు.

Related Stories: