సోషల్ మీడియా హబ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం

న్యూఢిల్లీ: సోషల్ మీడియా హబ్ ఏర్పాటుపై కేంద్రం వెనక్కి తగ్గింది. మీడియా హబ్ ఏర్పాటు నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. సోషల్ మీడియా హబ్ ద్వారా పౌరుల ఆన్‌లైన్ కదలికలను మానిటర్ చేస్తారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా హబ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టిపారేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తెలిపారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇచ్చిన వివరణ ఆధారంగా సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సోషల్ మీడియా విధానంపై కేంద్రం సంపూర్ణంగా సమీక్షించనున్నట్లు వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ప్రజల వ్యాట్సాప్ మెసేజ్‌లను ట్యాప్ చేసేందుకు సోషల్ మీడియా హబ్‌ను ఏర్పాటు చేస్తున్నారా అని గత వాదనల్లో కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
× RELATED సీఎం కేసీఆర్ నేటి ప్రచార సభల వివరాలు