తెలంగాణ పథకాలు భేష్

-జైపూర్‌లో కేంద్ర బృందం పర్యటన.. కంటి వెలుగు, రైతుబంధుకు కితాబు భీమారం (జైపూర్): తెలంగాణ ప్రభుత్వ పథకాలు భేషుగ్గా ఉన్నాయని కేంద్ర పరిశీలన బృందం సభ్యులు కితాబిచ్చారు. పథకాల అమలుపై కేంద్రబృందం సభ్యులు ఎంసీ బహుగుణ, విజయ్ గుప్తా, రాజ్‌పాల్ పాడ్య సోమవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలకేంద్రాన్ని సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో వారు మాట్లాడారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కంటివెలుగు, రైతుబంధు పథకాలు బాగున్నాయని ప్రశంసించారు.