ఆరోగ్య సంక్షేమ పథకాలను పరిశీలించిన కేంద్ర బృందం

కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సంక్షేమ పథకాల అమలు తీరును కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో జాతీయ ఆరోగ్య మిషన్ బృందం శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందుతున్నాయా? లేదా? అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇండియా రఘురాం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్య సంక్షేమం కోసం 40 రకాల పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. గ్రామంలో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందుతున్న పౌష్టికాహారం సక్రమంగా ఇస్తున్నారా?, మందులు అందజేస్తున్నారా?, పథకాలు నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటున్నాయా? అనే విషయాలపై విచారణ చేసి తెలుసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ కేంద్ర బృందం సభ్యులు శ్వేతాసింగ్, ప్రదీప్‌చంద్రా, సందేశ్, డబ్ల్యూహెచ్‌వో సభ్యుడు జయకృష్ణ, రాష్ట్ర బృందం సభ్యులు అరుణ్, రవితేజ, రఘునందన్, రంజిత్, జిల్లా వైద్యాధికారి సుజాత, తదితరులు పాల్గొన్నారు.
× RELATED కుప్పకూలిన కివీస్.. భారత్ టార్గెట్ 158