ఫాదర్స్ డే సందర్భంగా సెల‌బ్రిటీల స్పెష‌ల్ ట్వీట్స్‌

అమ్మ ప్రాణం పోసి..జీవమిస్తే...ఆప్రాణానికి.. ఓ రూపు ఇచ్చి.. వ్యక్తిగా తీర్చిదిద్దేది నాన్న.. ప్రతి విజయంలో వెనుకఉంటూ.. ఏం కష్టం వ‌చ్చినా నేనున్నానంటూ.. ఆసరా ఇచ్చే శక్తి నాన్న. నాన్న అంటే జీవితాన్ని నడిపించే వ్యక్తి, కుటుంబ కోసం అహర్నిషలు కష్టపడి, పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం తపన పడే వ్యక్తి నాన్న. తాను ఎన్నో కష్టాలు పడి కుటుంబ పోషణ భారమైనా భరిస్తూ, కష్టాన్ని ఎవరికీ తెలియకుండా అనునిత్యం శ్రమిస్తూ, కుటుంబానికి రక్షకుడిగా ఉండేది తండ్రి ఒక్కరే. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడంలో తండ్రి పాత్ర చాలకీలకమైంది. అందుకే ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా సాధారణ వ్యక్తులే కాక, సినీ సెలబ్రిటీలు కూడా తమ ఫాదర్స్‌తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియా ద్వారా ట్వీట్స్ చేస్తున్నారు. సోన‌మ్ క‌పూర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, కోన వెంక‌ట్‌, వ‌రుణ్ తేజ్ , నాగార్జున‌, మంచు ల‌క్ష్మీ, సుశాంత్ , ఆది, సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ త‌దిత‌రులు వారి త‌ల్లిదండ్రులతో కలిసి దిగిన అపురూపమైన ఫొటోలను అభిమానులతో పంచుకంటూ త‌మ జ్ఞాప‌కాల‌ని షేర్ చేసుకున్నారు.
× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..