సీఈసీ ప్రతినిధి బృందంతో భేటీ.. పార్టీలకు కేటాయించిన సమయమిదే

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఉన్నతస్థాయి సీఈసీ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ర్టానికి రానున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో రెండురోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ, పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో రేపు సాయంత్రం భేటీ కానుంది. సచివాలయంలోని సీఈవో కార్యాలయంలో సమావేశం ఉంటుంది. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ప్రతినిధులకు సమావేశానికి అవకాశం ఉంటుందని తెలిపింది. సమావేశానికి 15 నిమిషాల ముందే ప్రాంగణంలో ఉండాలని పార్టీలకు సూచించింది. బృందం బిజీ షెడ్యూల్ నేపథ్యంలో అదనపు సమయం కేటాయించడం వీలుకాదని ఆహ్వానంలో ఎన్నికల కమిషన్ పేర్కొంది. గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీలకు ఈసీ సమయం కేటాయించింది. పార్టీలకు కేటాయించిన సమయమిదే.. బీఎస్పీ- సాయంత్రం 6.30 నుంచి 6.40 వరకు బీజేపీ-సా. 6.40 నుంచి 6.50 సీపీఐ-సా.6.50 నుంచి 7.00 సీపీఎం-రాత్రి 7.00 నుంచి 7.10 ఐఎన్‌సీ-రాత్రి. 7.10 నుంచి 7.20 ఎంఐఎం-రాత్రి 7.20 నుంచి 7.30 టీఆర్‌ఎస్-రాత్రి 7.30 నుంచి 7.40 టీడీపీ-రాత్రి 7.40 నుంచి 7.50 వైసీపీ-రాత్రి 7.50 నుంచి 8.00

Related Stories: