రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు..

హైదరాబాద్: ఓఎన్‌జీసీ కాకినాడ డిప్యూటీ జనరల్ మేనేజర్ పీ వెంకట్‌రావు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. పీ వెంకట్‌రావు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా విశాఖపట్నం సీబీఐ అధికారుల బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సీబీఐ టీం..వెంకట్‌రావు ఇంట్లో తనిఖీలు చేపట్టింది. కేసు నమోదు చేసిన సీబీఐ బృందం దర్యాప్తు కొనసాగిస్తున్నది.
× RELATED తాగిన మైకంలో బాంబు బెదిరింపులు..జైలు శిక్ష