విజయ్ మాల్యాపై కేసు నమోదు

న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై తాజాగా మరో కేసు నమోదైంది. మాల్యా తమ వద్ద రుణం తీసుకుని ఎగవేశాడంటూ ఎస్బీఐ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు ఇవాళ సీబీఐ అధికారులు విజయ్ మాల్యాపై భారతీయ శిక్షా స్మృతిలోని 420, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, విజయ్ మాల్యా దేశంలోని పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేశాడని ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. తర్వాత మాల్యా మార్చి 2న దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి ఆయన లండన్‌లో ఉంటున్నారు.
× RELATED బాలిక కిడ్నాప్..24 గంటల్లోనే కాపాడారు