మృత్యుంజయ ప్రదర్శన

బెంగళూరు: నమస్తే తెలంగాణ దినపత్రిక కార్టూనిస్టు మృత్యుంజయ గీసిన కార్టూన్లతో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ (ఐఐసీ) సంస్థ శనివారం ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. 69 కార్టూన్లతో ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్ ఈనెల 22 వరకు కొనసాగనున్నది. మింతారా వంటి స్టార్టప్ వ్యవస్థలను స్థాపించిన రవీన్‌శాస్త్రి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి పలువురు కార్టూనిస్టులు హాజరై మృత్యుంజయ గీసిన కార్టూన్లపై ప్రశంసలు కురిపించారు. సమకాలిన అంశాలను కార్టూన్ ద్వారా సరళంగా హాస్యంతో కూడిన సందేశం పాఠకులపై ప్రభావం చూపుతుందని ఐఐసీ మేనేజింగ్ ట్రస్టీ వీజీ నరేంద్ర తెలిపారు. అనంతరం కార్టూనిస్టు మృత్యుంజయను ఐఐసీ ట్రస్టీ అయిన మంజునాథ్ ఘనంగా సన్మానించారు.

Related Stories: