బాలాజీపేట గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్

మహబూబాబాద్: జిల్లాలోని బయ్యారం మండలం బాలాజీపేట గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా అడిషనల్ ఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో పోలీసు, ఫారెస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం, బెల్టు షాపుల్లో మద్యం బాటిళ్లు, రవాణాకు సిద్ధంగా ఉంచిన టేకు కలప, సరైన పత్రాలు లేని 22 బైకులను స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదని ముందస్తుగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Related Stories: