దివ్యాంగులుగా మార్చిన కారు యాక్సిడెంట్లే వాళ్లను కలిపాయి!

ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ.. ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ.. అర్థంకాని పుస్తకమే ఐనాగాని ఈ ప్రేమ.. జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ.. ఓ తెలుగు సినిమాలోని ఈ పాట గుర్తొచ్చింది ఈ వార్త రాస్తుంటే. నిజంగానే ప్రేమ.. ఎవ్వరిని ఎప్పుడు తన వలలో బంధిస్తుందో చెప్పలేం. దానికి అనుప్ చంద్రన్, నేహల్ తక్కర్‌లే ఉదాహరణ. ఏంటా స్టోరీ తెలుసుకుందాం పదండి.. సౌత్ ఇండియాకు చెందిన అనుప్, వెస్ట్ ఇండియా స్టేట్ గుజరాత్‌కు చెందిన నేహల్ ఇద్దరూ దివ్యాంగులే. వాళ్లు పుట్టుకతో దివ్యాంగులు కాదు. కారు యాక్సిడెంట్ల వల్ల వాళ్లు కుర్చీలకే పరిమితమైపోయారు. ఇద్దరిదీ ఒకే రకమైన సమస్య. వెన్నుముక సమస్య. దీంతో వాళ్లు లేచి నడిచే పరిస్థితి లేదు. 2003లో ముంబైలోని ఓ ప్రాంతంలో అనుప్‌కు కార్ యాక్సిడెంట్ జరిగింది. మళ్లీ ఓ రెండేండ్ల తర్వాత అంటే.. 2005లో నేహల్‌కు కూడా కార్ యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఆమె కూడా జీవితాంతం కుర్చీకే పరిమితమైపోయింది. ఎక్కడైతే అనుప్‌కు యాక్సిడెంట్ జరిగిందో అదే ప్రాంతంలో నేహల్‌కు కూడా జరిగింది. అలా ఒకరికొకరు వాళ్లు తెలవకున్నా.. వాళ్లకు జరిగే ఘటనలు మాత్రం చాలా సిమిలర్‌గా ఉండేవి. అయితే.. ఒకరోజు.. వాళ్లిద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా ఓ ఫంక్షన్‌లో ఒకరినొకరు కలిశారు. ఇద్దరిదీ ఒకే సమస్య.. ఇద్దరిది ఒకే మనస్థత్వం కావడంతో వాళ్ల మనసులు కలిశాయి. అలా వాళ్ల ప్రేమ ప్రయాణం ప్రారంభమైంది. ఇద్దరిలో ఎప్పుడు ప్రేమ పుట్టిందో వాళ్లకే తెలియదు. అలా వాళ్లిద్దరు దగ్గరయ్యారు. పెండ్లి చేసుకుందామనుకున్నారు. సాధారణంగా లవ్ మ్యారేజి అనగానే పెద్దలు ఒప్పుకోరు కదా. సేమ్ అదే జరిగింది ఇద్దరి ఇండ్లలో. ఇద్దరూ లేచి నడవలేరు కదా. కనీసం చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా ఎలా? అని పెద్దలు ఆలోచించారు. కాని.. ఇవేవీ వాళ్లకు అడ్డు అనిపించలేదు. దాదాపు ఏడు సంవత్సరాలు పెద్దలతో పోరాటం చేశారు. పెద్దలు కూడా వాళ్ల ప్రేమకు లొంగిపోయారు. చివరకు వాళ్లు తమ ప్రేమలో గెలిచారు. రీసెంట్‌గా గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. ఇక.. వాళ్ల ప్రేమ, పెండ్లి స్టోరీని ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీంతో వాళ్ల స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు.. నెటిజన్లు వాళ్ల ప్రేమకు సలామ్ కొడుతున్నారు.

Related Stories: