ఇంధన ధరలపై జోక్యం చేసుకోలేం: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: రోజువారీ ఇంధన ధరల్లో మార్పులనేది కేంద్ర ఆర్థిక విధాన నిర్ణయం అని, దీనిపై జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు బుధవారం స్పష్టంచేసింది. వీటికి న్యాయస్థానాలు దూరంగా ఉండాలన్నది. ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ వీకే రావులతో కూడిన ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వమే ధరలను నిర్ణయించాలి. మేం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేం అని పేర్కొన్నది. ఇంధన ధరలపై ఢిల్లీవాసి పూజా మహాజన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వినతిపత్రంపై ఏం నిర్ణయం తీసుకున్నారో నాలుగువారాల్లోగా తెలుపాలని కేంద్రాన్ని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.

Related Stories: