362 కిలోల నిమ్మకాయలు ఎత్తుకెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు!

నిమ్మకాయలు కావాలంటే ఏం చేయాలి కొనుక్కోవాలి. కానీ అవి కొనుక్కోకుండా కొట్టేస్తే ఎలా ఉంటది అని అనుకున్నాడో ఏమో ఏకంగా 362 కిలోల నిమ్మకాయలను కొట్టేశాడు. అంతే కాదు.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకున్నది. 69 ఏండ్ల డియాన్కియో ఫియెర్రొస్ 362 కిలోల ఫ్రెష్ నిమ్మకాలను దొంగలించి తన వాహనంలో వేసుకొని వెళ్తున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తన వాహనం ఆగినప్పుడు అనుమానం వచ్చిన పోలీసులు అతడిని కిందికి దించి తన వాహనాన్ని చెక్ చేశారు. దీంతో అసలు బండారం బయట పడింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే.. థర్మల్ ఏరియాలో వ్యవసాయ క్షేత్రాల్లో దొంగలు పడుతున్నారని.. వారిని పట్టుకోవడం కోసం గాలిస్తున్న పోలీసులకు ఈ నిమ్మకాయల దొంగ అడ్డంగా దొరికిపోయాడు. ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆ దొంగ వీటిని దొంగలించాడట. దీంతో దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది. ట్విట్టర్ యూజర్లు నిమ్మకాయల దొంగపై భలే జోకులు వేసుకుంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
× RELATED పంచాయతీ ఎన్నికలు.. ఏజెంట్ కు గుండెపోటు