కేబినెట్ మీటింగ్ నుంచి ప్రెస్‌మీట్ దాకా.. ప్రతి క్షణం ఉత్కంఠ

హైదరాబాద్ : అసెంబ్లీని ఇవాళ రద్దు చేస్తారని వార్తలు రావడంతో.. నిన్న రాత్రి నుంచి ప్రగతి భవన్ వద్ద కోలాహలంగా మారింది. ఇవాళ ఉదయమే మీడియా అక్కడికి చేరుకొని కేసీఆర్ ను ఎవరూ కలుస్తున్నారు.. అక్కడ ఏం జరుగుతుందని మీడియా ప్రతినిధులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రజలు కూడా అదే స్థాయిలో ఆసక్తి కనబరిచారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం దాకా ప్రతి క్షణం ఉత్కంఠగా మారింది. కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రజలు కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. కేబినెట్ భేటీ నిమిషాల వ్యవధిలోనే ముగియడం.. అక్కడి నుంచి రాజ్ భవన్ కు కేసీఆర్ వెళ్లి అరగంట పాటు గవర్నర్ తో కేసీఆర్ భేటీ కావడం జరిగింది. ఆ తర్వాత ప్రగతి భవన్ చేరుకోని.. మళ్లీ తెలంగాణ భవన్ చేరుకొని కేసీఆర్ మీడియాతో మాట్లాడే వరకు అప్ డేట్స్.. క్షణం క్షణం -మధ్యాహ్నం ఒంటిగంటకు కేబినెట్ భేటీ -1:02 గంటలకు అసెంబ్లీ రద్దుకు సిఫారసు -1:15 గంటలకు రాజ్‌భవన్‌కు కేసీఆర్ -1:25 గంటలకు గవర్నర్‌తో కేసీఆర్ సమావేశం -1:50 గంటలకు అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం -2:00 గంటలకు రాజ్‌భవన్ నుంచి బయల్దేరిన కేసీఆర్ -2:06 గంటలకు ప్రగతి భవన్ చేరుకున్న కేసీఆర్ -2:35 గంటలకు తెలంగాణ భవన్ చేరుకున్న కేసీఆర్ -2:46 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్
× RELATED బంధువుల ఇంట్లో బస.. పోలింగ్ సిబ్బంది తొలగింపు