వారంలోగా పరిస్థితులు మారుతాయి: ఎస్‌బీఐ చైర్మన్

ముంబై: దేశవ్యాప్తంగా నెలకొన్న నగదు కొరతపై ఎస్‌బీఐ చైర్మన్ రజినిశ్ కుమార్ స్పందించారు. వచ్చే వారం పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయన్నారు. ఇలాంటి పరిస్థితులను అంచనా వేసేందుకు తమ వద్ద ప్రత్యేక శాఖ ఉందని ఆయన అన్నారు. ఇదేమీ కొత్తకాదన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి కొత్త 500 నోట్లను పెంచాలన్న ఇండెంట్‌ను ఆర్బీఐకి అందజేశామని, త్వరలోనే నగదు కొరత తీరుతుందని రజినిశ్ తెలిపారు. రైతుల సీజన్ వచ్చిందని, దాని వల్ల రైతులకు అందాల్సిన పేమెంట్లు ఎక్కువగా ఉంటాయని, మహారాష్ర్టా కానీ ముంబైలో కానీ నగదు కొరత సమస్యలేదని ఎస్‌బీఐ చైర్మన్ తెలిపారు.
× RELATED 'పంచాయతీ'ఎన్నికల పోలింగ్ ప్రారంభం