ఇద్దరు వ్యాపారవేత్తల కాల్చివేత..

ప్రతాప్‌గఢ్: ఇద్దరు వ్యాపారవేత్తలను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ కోహండవుర్ ప్రాంతంలో జరిగింది. శ్యాంసుందర్ జైశ్వాల్ (55), శ్యామ్ మురత్ జైశ్వాల్ (48)ల దగ్గరకు దుండగులు బైకుపై వచ్చికాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

భవన నిర్మాణ సరుకుల వ్యాపారంలో ఉన్న ఇద్దరు వ్యాపారులకు దుండగులు కొన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. అయితే డబ్బు ఇవ్వకపోవడంతో వారిపై దుండగులు కాల్పులు జరిపారు. వ్యాపారవేత్తల హత్యలతో స్థానికులు అలాహాబాద్-ఫైజాబాద్ రహదారిపై ఆందోళన నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి కలగజేసుకుని ఈ ఘటనలో నిందితులను పట్టుకుని, వారిని శిక్షిస్తామని హామీనిచ్చారు.

Related Stories: